నవతెలంగాణ –గోదావరిఖని: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను 23వ డివిజన్ గౌతమి నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ నాయకులు బెంద్రం రాజిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు కలిసి సీఎం జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న నాయకత్వం, ధైర్యసాహసాలు ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన పాలనలో ప్రజల సంక్షేమం దిశగా అనేక సంస్కరణలు చోటుచేసుకున్నాయని, తెలంగాణకు కొత్త దిశను చూపిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో రామగుండం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గౌతమి నగర్ చౌరస్తా లో స్థానిక ప్రజలు కూడా పాల్గొని సీఎం పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ బెంద్రం సునీత రాజిరెడ్డి పివిఆర్ అధ్యక్షుడు ఎండి ఆసిఫ్ ఖాన్ రామకృష్ణారెడ్డి విజయ్ సంజీవ్ రామన్ బాబు గుంపుల బాలరాజు పెనుగొండ మల్లేష్ అశోక్ లింగయ్య నవ లత సారమ్మ సీతమ్మ ఆటో యూనియన్ సభ్యులు చిరు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


