Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.!

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.!

- Advertisement -

నవతెలంగాణ–మల్హర్ రావు.
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంమైన తాడిచెర్లలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందారపు రాకెష్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గడపకు చేరే విధంగా అందిస్తున్నారన్నారు.గత పాలకులు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య,ఇందారపు చెంద్రయ్య,శివ,దుర్గాప్రసాద్, బొబ్బిలి రాజు,బండి స్వామి,కుమార్, ఐలయ్య ,సింగిల్ డైరెక్టర్ ప్రకాష్ రావు, యూత్ నాయకులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -