Sunday, November 9, 2025
E-PAPER
Homeసినిమాహర.. హర.. మహాదేవ

హర.. హర.. మహాదేవ

- Advertisement -

నందమూరి బాలకష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ ‘అఖండ’కు సీక్వెల్‌. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.
తాజాగా మేకర్స్‌ ‘తాండవం..’ సాంగ్‌ ప్రోమోని రిలీజ్‌ చేశారు. సంగీత దర్శకుడు తమన్‌ పవర్‌ఫుల్‌ బీట్స్‌, డివోషనలో చాంట్స్‌తో ఈ సాంగ్‌ని అద్భుతంగా కంపోజ్‌ చేశారు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకంతో బాలకష్ణ చేసిన అఖండ తాండవం గూస్‌ బంప్స్‌ తెప్పించింది. ప్రోమో సాంగ్‌ పై అంచనాలని భారీగా పెంచింది. ఫుల్‌ సాంగ్‌ ఈనెల 14న విడుదల కానుంది అని చిత్రయూనిట్‌ తెలిపింది.
సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈచిత్రంలో ఆది పినిశెట్టి ఓ పవర్‌ ఫుల్‌ పాత్రని పోషిస్తుండగా, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈచిత్రానికి డీఓపీ : రాంప్రసాద్‌, సంతోష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కోటి పరుచూరి, ఆర్ట్‌: ఏఎస్‌ ప్రకాష్‌, ఎడిటర్‌: తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -