Sunday, November 9, 2025
E-PAPER
Homeసినిమా100% వినోదం..

100% వినోదం..

- Advertisement -

హీరో శ్రీ నందు నటిస్తున్న చిత్రం ‘సైక్‌ సిద్ధార్థ’. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా బ్యాకింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
వరుణ్‌ రెడ్డి దర్శకుడు. స్పిరిట్‌ మీడియా, నందునెస్‌ కీప్‌ రోలింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్‌ సుందర్‌ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు.
యామిని భాస్కర్‌ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్‌, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 12న ఈ సినిమా ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా విడుదల కానుంది. మార్కెటింగ్‌ను రానా స్పిరిట్‌ మీడియా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
హీరో శ్రీ నందు మాట్లాడుతూ,’మా టీజర్‌ కట్‌ కొత్తగా ఉండాలని ప్రయత్నంతో చేశాం. ఈ సినిమాలో ఫన్‌ని డెఫినెట్‌గా ఎంజారు చేస్తారు. ఇది ఫ్యామిలీకి కూడా నచ్చే సినిమా. సురేష్‌ బాబు, రానా దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్‌ ఉంది. సినిమా మొత్తం నేచురల్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేశాం. ఇప్పటివరకు నాలో చూడని ఒక కొత్త కోణం ఇందులో కనిపిస్తుంది’ అని తెలిపారు. ‘చాలా కొత్తగా అనిపించే సినిమా ఇది. ఈ టైటిల్‌ కథకి పర్ఫెక్ట్‌ యాప్ట్‌. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రమోషన్స్‌లో చాలా క్లియర్‌గా చెప్పబోతున్నాము. నందు చాలా అద్భుతమైన పెర్ఫార్మర్‌’ అని డైరెక్టర్‌ వరుణ్‌ రెడ్డి చెప్పారు. యామిని మాట్లాడుతూ,’ఇది మాకు చాలా స్పెషల్‌ ఫిలిం’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -