Sunday, November 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్ర పండుగగా కోటి దీపోత్సవం

రాష్ట్ర పండుగగా కోటి దీపోత్సవం

- Advertisement -

– వచ్చే ఏడాది నుంచి అధికారికంగా నిర్వహిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భక్తి ఛానల్‌ ప్రతీయేటా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది నుంచి దీన్ని అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కొనసాగుతున్న ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ శనివారం సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి దీపోత్సవానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జాతీయ పండుగగా గుర్తించాలంటూ ప్రధాని మోడీకి లేఖ రాస్తానని చెప్పారు. గత 14 ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశ సరిహద్దులు దాటిందని తెలిపారు. ఆధ్యాత్మికత మనందరికీ ఒక శక్తిని, ఒక స్ఫూర్తిని అందిస్తుందని పేర్కొన్నారు. తన పుట్టిన రోజునాడే కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొని, అందరి మధ్య గడపటమనేది జీవిత కాల జ్ఞాపకంగా మిగిలిపోతుందని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -