నవతెలంగాణ – హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా, తప్పులతో కూడినది కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, ప్రజల భూములకు భద్రత, భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి ఇకపై ఉండదని, నూతన రెవెన్యూ చట్టం భూభారతి-2025 సోమవారం నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మూడు జిల్లాల్లోని మూడు మండలాల్లో పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సమస్యల్ని పరిష్కరిస్తామని అన్నారు. జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఈ సందర్బంగా ఆయన వివరించారు. భూభారతి పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి నేడు సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ఆదివారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తెచ్చిన ధరణి పోర్టల్ మాదిరిగా ఇది మూడు, నాలుగేళ్లకు పరిమితం కాదు. భవిష్యత్తులో తెలంగాణకు ఏ సీఎం వచ్చినా అమలు చేసేలా పారదర్శకంగా రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు.
నేటి నుంచి అమల్లోకి రానున్న భూభారతి పోర్టల్ : మంత్రి పొంగులేటి
- Advertisement -
RELATED ARTICLES