వాషింగ్టన్ : తేలికపాటి తేజస్ యుద్ధ విమానాల కార్యక్రమం కోసం 113 ఎఫ్404-జీఈ-ఐఎన్20 జెట్ ఇంజిన్లను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్‌తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. ఈ ఒప్పందం ప్రకారం జెట్ ఇంజిన్ల సరఫరా 2027లో ప్రారంభమై 2032 నాటికి పూర్తవుతుంది.
తేలికపాటి యుద్ధ విమానాల (ఎల్‌సీఏ) ఎంకే 1ఏ ప్రోగ్రాం అమలు కోసం ఈ ఇంజిన్లను ఉపయోగిస్తామని హెచ్‌ఏఎల్ తెలిపింది. భారత వైమానిక దళానికి అవసరమైన 97 తేజస్ ఎంకే 1ఏ ఫైటర్ల కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ సెప్టెంబరులో హెచ్‌ఏఎల్‌తో రూ.62,370 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2021లో 99 ఇంజిన్ల కోసం ఆర్డర్ ఇచ్చినప్పటికీ జీఈ సంస్థ నుంచి వాటి సరఫరా నత్తనడక నడిచింది. ఇప్పటి వరకూ కేవలం నాలుగు ఇంజిన్లు మాత్రమే వచ్చాయి. కోవిడ్ అనంతరం సరఫరాలో జరిగిన అవాంతరాలే దీనికి కారణమని జీఈ చెబుతోంది.
అమెరికా నుంచి తేజస్ జెట్ విమానాల ఇంజిన్ల కొనుగోలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



