Sunday, November 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ వాసికి లాటరీలో రూ.240కోట్లు

తెలంగాణ వాసికి లాటరీలో రూ.240కోట్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : యూఏఈలో తీసిన లాటరీలో రూ.240 కోట్లు సొంతం చేసుకున్నాడు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరానికి చెందిన యువకుడు. తన తల్లి పుట్టిన రోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.240 కోట్లు సొంతం చేసుకున్నాడు బోళ్ల మాధవరావు, భూలక్ష్మిల కుమారుడు అనిల్‌కుమార్‌.

సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బోళ్ల అనిల్‌కుమార్‌ ప్రాథమిక విద్య అనంతరం చదువును హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ప్రస్తుతం యూఏఈలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూన్నాడు. ఇటీవల తాను కొనుగోలు చేసిన టికెట్లలో తన తల్లి పుట్టినరోజుతో కూడిన లాటరీ నంబర్‌కు జాక్‌పాట్‌ తగిలింది. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దఎత్తున వైరల్‌గా మారి సెలబ్రిటీ స్థానంలో ఆయన నిలిచిపోయారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని లాటరీ ఒక్కసారిగా ధనికులను చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -