-గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థికి ఘన సన్మానం
నవతెలంగాణ-రామగిరి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సెంటినరీ కాలనీ రామగిరి మండలం పెద్దపల్లి జిల్లాకు చెందిన కదార కళాధర్ రెడ్డి- అరుణ దంపతుల కూతురు కదరా హాస్య రెడ్డి కి శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2021- 22 సంవత్సరానికి గాను ఎంఫార్మసీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వైస్ ఛాన్స్లర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ సాధించి అందుకున్న సందర్బగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం ముదిరాజ్, రామగిరి మండల అధ్యక్షులు పరంకుశం శ్రీనివాస చారి, చేతుల మీదుగా ఘనంగ సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులు బత్తుల శంకర్, వనం శేషగిరిరావు, ఆరెందల ప్రకాష్, కీర్తి లక్ష్మీనారాయణ, తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని అభినందించారు
రామగిరి 1 హాస్యన సన్మానిస్తున్న తెలంగాణ ఫోరం ఉద్యమ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



