Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టుల సంక్షేమ కోసం రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించాలి

జర్నలిస్టుల సంక్షేమ కోసం రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించాలి

- Advertisement -

 కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందేలా హెల్త్ కార్డులు ఇవ్వాలి..
ఐఎఫ్ డబ్ల్యూ జె జాతీయ కౌన్సిల్ సభ్యులు దూమర్ల భాస్కర్..
నవతెలంగాణ – అచ్చంపేట
జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్ల బడ్జెట్ కేటాయించాలని కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం అందే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని (IFWJ) ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు దూమర్ల భాస్కర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని రోడ్ల భవనాల శాఖ అతిథి గృహంలో సంఘం ఏర్పడి 75 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న  సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 1950లో న్యూఢిల్లీలో ఏర్పడిన జర్నలిస్టుల సంస్థ.

ఇది భారతదేశంలో మీడియా నిపుణుల కోసం ఏర్పడిన మొట్టమొదటి ట్రేడ్ యూనియన్, న్యాయవాదం, ట్రేడ్ యూనియన్ పోరాటాలు, ఇతర కార్యకలాపాల ద్వారా జర్నలిస్టుల పని పరిస్థితులను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. IFWJ 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వివిధ మీడియా వేదికలలో 30,000 కంటే ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉంది. మీడియా పరిశోధన, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడంలో చురుకుగా ఉందన్నారు.

 వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ సామాజిక బాధ్యతతో జర్నలిజం రంగంలో కొనసాగుతున్నారని ఈ విషయాన్ని ప్రభుత్వం పాలకులు గుర్తించాలన్నారు. జర్నలిజంలో 20 ఏళ్లు పూర్తిచేసిన సీనియర్ జర్నలిస్టులకు ప్రతినెలా పింఛన్ రూ.10000/- ఇవ్వాలని, 20 ఏళ్లుగా జర్నలిస్టులు ఇళ్లస్థలాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అర్హతగల  జర్నలిస్టులకు సమాచార పౌర సంబంధాల శాఖలో ఉద్యోగులుగా అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ సంఘాన్ని బలోపేతం చేసేందుకు జర్నలిస్టులు కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కాలూరి శీను సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ జర్నలిస్టులు శ్రీశైలం, లక్ష్మణ్, శ్రీనివాస్, కళ్యాణ్, మహేష్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -