- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
అడవిలో గొర్రెలు, మేకలు మేపుకునేందుకు అనుమతించడం లేదంటూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యాదవులు ఆదివారం ఎఫ్ఎఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అటవీశాఖ అధికారులు తమపై దుర్భాషలాడుతూ.. చిత్రహింసలకు గురిచేస్తున్నారని యాదవులు ఆరోపించారు. తమ గొర్రెలు, మేకలు మేపుకోవడానికి అడవిలోకి అనుమతి ఇవ్వాలని వారు ఈ సందర్భంగా అధికారులను కోరారు.
- Advertisement -



