Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ నాళా ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో..

కౌలాస్ నాళా ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కౌలాస్ నాళా ప్రాజెక్టు ఇన్ ప్లో ఎగువ నుండి తగ్గడం జరిగింది. ఆదివారం ఉదయం ఆరు గంటల సమయం నాటికి ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు కానీ 458 మీటర్లు నిలకడగా నిల్వ కొనసాగుతూ ఉంది. కెపాసిటీ  1.237 టీఎంసీ ఉంది. ఎగువ నుండి 100 క్యూసెక్కుల నీరు  వచ్చి ప్రాజెక్టు లోకి చేరుతుంది. ఎగువ నుండి ప్రాజెక్టులోకి వచ్చిన నీటిని వచ్చినట్టు ఒక గేటు ద్వారా దిగువకు వరద కాలు వా ద్వారా విడుదల చేస్తూ మరియు కొంత నీటిని ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు విడుదల చేస్తున్నారు. ఇటీవలే నాలుగు రోజుల క్రితం అనుకోకుండా ఎగువ నుండి భారీగా ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి రావడంతో తప్పని పరిస్థితిలో అధికారులు నీటిని దిగువ కు విడుదల చేశారు.

నీటి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని బిచ్కుంద అయ్యప్ప ఆలయం ఎక్స్ రోడ్ వద్ద నీటి పరివాహక ప్రాంత రైతులు మూడు గంటలపాటు ధర్నా రాస్తారోకు చేయడం జరిగింది. అనుకోకుండా విడుదల చేసిన నీటి వలన రైతుల పంటలు దెబ్బ తినడమే కాక వారికి సంబంధించిన ట్రాక్టర్లు పాడి పశువులు చనిపోయి భారీగా నష్టం వాటిల్లింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా నీటిని విడుదల చేసినందుకు రైతులు అధికారులపై మండిపడ్డారు. తమకు సమాచారం ఇవ్వకుండా నీటిని విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు  నష్టపరిహారం చెల్లించాలని రైతులు అధికారులపై మండిపడ్డారు. ఉన్నత అధికారుల హామీ మేరకు రైతులు ధర్నాను విరమించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -