Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్న్యాయ సేవల సాక్షరత దినోత్సవం..

న్యాయ సేవల సాక్షరత దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
న్యాయ సేవా సంస్థ చట్టం నవంబర్ 9న అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి వెంకటేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఎన్ రాజశేఖర్ సిహెచ్ సరితలు తెలిపారు. ఆదివారం స్థానిక తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాల కళాశాలలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ చట్టం ద్వారా ప్రజలకు న్యాయ సేవలు చేరువై ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు, లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం, ప్రజలకు చట్టాలపై అవగాహన మొదలగు అన్ని సేవలు ఈ చట్టం ద్వారా అందుతున్నాయని తెలిపారు. పోక్సో చట్టం, మాదక ద్రవ్య నిషేధం అట్టి నేరాలపై ఉన్న శిక్షలు, విద్యా హక్కు చట్టం, బాల్య వివాహాలు మొదలగు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమములో  కళాశాల లెక్చరర్ పాండు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సూపరింటెండెంట్ సాయిలక్ష్మి,  సంస్థ సిబ్బంది  నరసింహరావు, శ్రీనివాస్, రాజు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -