నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారం రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మండల అధ్యక్షులు బొడ్డు తరుణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకుల చేరారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న.. ఆయనతోనే ఈ రాష్ట్రం పురోగతి సాధిస్తుందని మాకు విశ్వాసం ఉంది. కనుక టిఆర్పి పార్టీలో చేరడం జరిగింది అన్నారు.
తీన్మార్ మల్లన్న గారు విద్య వైద్యం సత్వర న్యాయం భూమిలేని పేద రైతులకు రెండు ఎకరాల భూమి ఇలాంటి అంశాలతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలుసుకొని ప్రభుత్వాన్ని 2028లో ఏర్పాటు చేస్తామని దానికి మా వంతుగా శక్తివంతెన లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. బొడ్డు తరుణ్ తో పాటు కాటారం కార్యకర్తలు , జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్, రాజ్ గండు ,కరుణాకర్ ,సామల చంద్రశేఖర్ ,బండి సునీల్ ,ఎండి సలీం పాషా, పాల్గొన్నారు.
టీఆర్పీ పార్టీలో చేరికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



