సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు హీరోగా వెండితెరకి పరిచయం కాబోతున్నారు. కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, ‘ఆర్‌ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్ అశ్వినిదత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. కృష్ణతో కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘అగ్ని పర్వతం’, ‘రాజకుమారుడు’తో మహేష్ బాబును తెలుగు సినిమాకు పరిచయం చేసిన అశ్విని దత్ ఇప్పుడు మూడవ తరం జయకృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం విశేషం. అద్భుతమైన కొండల మధ్య సాగే సినిమా. మనసుకు హత్తుకునే ప్రేమకథ ప్రధానంగా ఉంటుంది. భావోద్వేగాలు, నిజాయితీ, రియలిజం కలగలిపిన ఈ సినిమా కొత్త తరహా ప్రేమకథగా నిలవనుంది. అనౌన్స్మెంట్ పోస్టర్‌లో తిరుమల ఆలయం, పరిసర పర్వతాల క్యారికేచర్ ఉండటం అందరిలోనూ అసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెలలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
హీరోగా మరో ఘట్టమనేని వారసుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



