Monday, November 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలునయా హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌

నయా హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

తిరువీర్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా ఓ కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో భరత్‌ దర్శన్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై మహేశ్వర రెడ్డి మూలి ప్రొడక్షన్‌ నెం.2గా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రేక్షకులకు వైవిధ్యమైన కథలతో అలరించే తిరువీర్‌ ‘మసూద నుంచి ప్రీ వెడ్డింగ్‌ షో’ వరకు డిఫరెంట్‌ జోనర్లలో ఆకట్టుకున్నారు. ఈ కొత్త సినిమా హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది.

‘రజాకార్‌, పోలిమేర’ చిత్రాలకు చేసిన సి.హెచ్‌. కుషేందర్‌ దీనికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎం.ఎం.కీరవాణి శిష్యుడు భరత్‌ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. ‘బలగం’ ఫేం తిరుమల ఎం.తిరుపతి ఆర్ట్‌ డైరెక్టర్‌, ‘క’ చిత్రానికి ఎడిటింగ్‌ చేసిన శ్రీ వరప్రసాద్‌ ఎడిటర్‌. ‘స్వయంభు’ చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌. పూర్ణచారి పాటలు రాస్తున్నారు.
ఈ నెల 19వ తేదీ నుండి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -