Monday, November 10, 2025
E-PAPER
Homeఆటలు417 సరిపోలేదు

417 సరిపోలేదు

- Advertisement -

భారత్‌-ఏపై సఫారీ-ఏ గెలుపు

బెంగళూరు : భారత్‌-ఏపై దక్షిణాఫ్రికా-ఏ మెరుపు విజయం సాధించింది. సఫారీలకు 417 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా… మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ వంటి మేటి బౌలర్లను ఎదుర్కొని ఆ జట్టు 5 వికెట్ల తేడాతో రెండో అనధికార టెస్టులో గెలుపొందింది. ఓపెనర్లు జోర్డాన్‌ (91, 123 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), లెసోగో (77, 174 బంతుల్లో 11 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కి తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించారు. హమ్జా (77), తెంబ బవుమా (59), కానర్‌ (52 నాటౌట్‌) సైతం అర్థ సెంచరీలు సాధించగా 98 ఓవర్లలో 5 వికెట్లకు దక్షిణాఫ్రికా 417 పరుగులు చేసింది. ప్రసిద్‌ కృష్ణ (2/49), మహ్మద్‌ సిరాజ్‌ (1/53), ఆకాశ్‌ దీప్‌ (1/106), హర్ష్‌ దూబె (1/111) వికెట్లు పడగొట్టగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ (0/81) మాయ చేయలేకపోయాడు. తొలి అనధికార టెస్టులో భారత్‌-ఏ గెలుపొందగా.. రెండు మ్యాచ్‌ల నాలుగు రోజుల సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. వరుస ఇన్నింగ్స్‌ల్లో శతకాలు సాధించిన ధ్రువ్‌ జురెల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -