Monday, November 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకొల్లూరు కాలనీవాసుల సమస్యలను 24గంటల్లో నెరవేర్చాం

కొల్లూరు కాలనీవాసుల సమస్యలను 24గంటల్లో నెరవేర్చాం

- Advertisement -

కాంగ్రెస్‌ పాలనకు ఇది నిదర్శనం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

సంగారెడ్డి జిల్లా కొల్లూరు కాలనీవాసుల సమస్యలను 24 గంటల్లో పరిష్కారించామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాలనీలో సుమారు 16 వేల కుటుంబాలు, 48వేల జనాభా నివాసం ఉంటుందని తెలిపారు. ఆదివారం కొల్లూరు కాలనీవాసులతో మంత్రి మహమ్మద్‌ అజహరుద్దీన్‌, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, కౌన్సిలర్‌ భరత్‌తో కలిసి మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొల్లూరు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల కాలనీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని తెలిపారు. వారం రోజుల క్రితం ఇచ్చిన మాట ప్రకారం కాలనీ వాసుల చాలా సమస్యలను కొన్నింటిని పరిష్కరించామన్నారు. కాలనీలో సన్నబియ్యం తీసుకునే లబ్ధిదారుల కోసం రేషన్‌ దుకాణం, కాలనీ లోపలకి ఆర్టీసీ బస్సులు వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు.

కాలనీవాసుల రక్షణ కోసం శాశ్వత పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణం చేపట్టామన్నారు. అంతవరకు తాత్కాలిక పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గతంలోనే ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. అత్యవసర కోసం రెండు అంబులెన్స్‌లను అందించామని తెలిపారు. కాలనీలో స్పీడ్‌ బ్రేకర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ వెంటనే ఏర్పాటు చేస్తామనీ, శ్మశానవాటిక ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీలో అరులైన పేదలందరికీ గృహ జ్యోతి పధకం కింద 200 వరకు యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు. వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్‌ తీసుకునే విధంగా వచ్చే నెల నుంచి ఇక్కడే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాలనీలో దుకాణాల ఏర్పాటు కోసం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. కాలనీ అభివద్ది కార్యక్రమాల కోసం ‘కాలనీవాసులు కమిటీ’ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -