Monday, November 10, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజావాణి ఫిర్యాదులపై  ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

ప్రజావాణి ఫిర్యాదులపై  ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.  ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ఆమె ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉంచవద్దని, ఒకవేళ ఫిర్యాదు పరిష్కారం కానట్లయితే ఫిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. పిర్యాదుపై చర్యలు తీసుకున్నట్లైతే   సమాచారాన్ని కలెక్టర్ కార్యాలయ్యనికి తెలియజేయాలని ఆమె కోరారు. ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లా కేంద్రం నుండి కింది స్తాయివరకు జాప్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజా వాణి లో మొత్తం 94 ఫిర్యాదులు రాగా, అందులో జిల్లా అధికారులకు 31  ఫిర్యాదులు,రెవిన్యూ శాఖకు 63 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు  కలెక్టర్ జె. శ్రీనివాస్ ,గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ ,ఇన్చార్జ్ డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు   స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -