Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందెశ్రీ అకాల మరణానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి సంతాపం

అందెశ్రీ అకాల మరణానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి సంతాపం

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రజాకవి, ప్రకృతి కవి, ఆశుకవి, తెలంగాణ మాతృగీతం రచయిత,  సుప్రసిద్ధులైన డాక్టర్. అందె శ్రీ ఆకస్మిక మరణం పట్ల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ యాస, సాహిత్యానికి ఎనలేని సేవ చేశారని, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ  మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని కొనియాడారు. తెలంగాణ పోరాటంలో ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారని, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని  గతాన్ని గుర్తుచేసుకున్నారు.  అందె శ్రీ బాల్యం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో గడవటం జిల్లా చెసుకున్న సౌభాగ్యం అని తెలిపారు. వారి మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -