Monday, November 10, 2025
E-PAPER
Homeఖమ్మంజిల్లా స్థాయి క్విజ్ లో సత్తా చాటిన స్థానిక విద్యార్ధి

జిల్లా స్థాయి క్విజ్ లో సత్తా చాటిన స్థానిక విద్యార్ధి

- Advertisement -

– సాధించిన కన్సోలేషన్ బహుమతి
– అభినందించిన ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

టీఎస్ జీహెచ్ఎంఏ, టీఎస్ఏటీ ఇటీవల నిర్వహించిన క్విజ్ పోటీల్లో స్థానిక విద్యార్ధులు తన సత్తా చాటి మండలానికి గుర్తింపు తెచ్చారు. సోమవారం జిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో మండలానికి చెందిన విద్యార్ధి కన్సోలేషన్ బహుమతి పొందారు. టీఎస్ జీహెచ్ఎంఏ,టీఎస్ఏటీ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన క్విజ్,ఉపన్యాస,వ్యాసరచన పోటీల్లో మండలంలోని మామిళ్ళవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ది మద్దాల ప్రవీణ్ కుమార్ జిల్లాస్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచి కన్సలేషన్ బహుమతి పొందాడు.

మండల స్థాయి పోటీల్లో క్విజ్ ద్వితీయ స్థానం లో  జడ్పీహెచ్ఎస్ నారాయణపురం, తృతీయ స్థానం లో జడ్పీహెచ్ఎస్ గుమ్మడవల్లి, వ్యాసరచన లో ద్వితీయ స్థానంలో జెడ్పీహెచ్ఎస్ గుమ్మడవల్లి, ఉపన్యాస లో ద్వితీయ స్థాయిలో జెడ్పీహెచ్ఎస్ అశ్వారావుపేట విద్యార్ధులు రాణించారు. ఈ విద్యార్ధులు ఎంఈఓ ప్రసాదరావు తోపాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ,తాళ్ళపాటి వీరేశ్వరరావు,పి.హరిత లు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -