Monday, November 10, 2025
E-PAPER
Homeజిల్లాలుఅద్దెకు మండల పరిషత్ కార్యాలయ కాంప్లెక్స్ గదులు

అద్దెకు మండల పరిషత్ కార్యాలయ కాంప్లెక్స్ గదులు

- Advertisement -

– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ 
నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల కాంప్లెక్స్ లో ఉన్న నాలుగు గదులను అద్దెకు ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి అవసరం ఉన్నవారు సంప్రదించాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మించిన నాటి నుండి నిరుపయోగంగా ఉన్న కాంప్లెక్స్ గదుల పై ‘లక్షలు వెచ్చించారు… లక్షణంగా వదిలేశారు’ శీర్షికతో నవతెలంగాణలో వెలువడిన కథనానికి ఆయన స్పందించారు. కాంప్లెక్స్ భవనంలో ఉన్న నాలుగు గదులను అద్దెకు ఇచ్చేందుకు ప్రకటన విడుదల చేశారు. అసక్తి ఉన్నవారు దుకాణాలు పెట్టుకోవడానికి గానీ, గోదాముల కొరకు గాని అతి సరసమైన ధరలకు అద్దెకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఒక్కో దుకాణంకు గాను రూ. పదివేల అడ్వాన్స్, నెలకు రూ.1500 కిరాయికి గదులను అద్దెకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు మండల పరిషత్ కార్యాలయంలో పని వేళలో సంప్రదించి, అడ్వాన్స్ చెల్లించి అద్దెకు పొందాలని ఆయన సూచించారు. కాగా సంవత్సరాల తరబడి నిరుపయోగంగా ఉన్న కాంప్లెక్స్ గదులను ఎట్టకేలకు మండల పరిషత్ కార్యాలయ అధికారులు అద్దెకు ఇచ్చేందుకు ముందుకు రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -