Monday, November 10, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆకాష్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆకాష్

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డిప్యూటీ డిఎంహెచ్వో ఆకాష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం అస్పత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు తో సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రతి రోజు గ్రామంలో పర్యటించి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. దింతో ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అదే విదంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో తొమ్మిది సబ్ సెంటర్లు లో పని చేసే వారు తప్పనిసరిగా సమయ పాలనా పాటించి  వైద్య సదుపాయాలు  అందించేలా నీకు చూడాలని తెలిపారు.

దీంతో సబ్ సెంటర్లో విధులు నిర్వహించే సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సబ్ సెంటర్లో విధులు నిర్వహించి అక్కడి నుండి నాలుగు గంటల వరకు ఫీల్డ్ వర్క్ చేసేలా చూడలని తెలిపారు. ఆసుపత్రి చుట్టూ ప్రహరీ లేకపోవడంతో వర్షాకాలంలో వర్షపు నీరు ఆసుపత్రి చుట్టూ విధులు నిర్వహించే వైద్యులకు మరియు ఆసుపత్రికి వచ్చే రోగులకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రహరీ నిర్మించేందుకు ధనవంతుగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు విజయ్. ప్రణయ్, మరియు అస్పత్రి సిబ్బంది ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -