Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా కళలను కాపాడుకుందాం

ప్రజా కళలను కాపాడుకుందాం

- Advertisement -

• ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి 
నవతెలంగాణ-మర్రిగూడ
ప్రజా కళలను కాపాడుకోవాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గడ్డం రాంబాబు అధ్యక్షతన జరిగిన ప్రజానాట్యమండలి మండల మూడవ మహాసభలో ఆయన మాట్లాడారు. సప్తర్ అస్మి అంజన్న వారసులుగా ప్రజా కళలని పరిరక్షించాలని,గ్రామీణ ప్రాంతాల్లో  కళాకారులని ఆదరించి ప్రజా సంస్కృతిని  పరిరక్షించాలని అన్నారు. నేడు సోషల్ మీడియాలో వస్తున్న విష సంస్కృతికి ప్రభావితమై యువత చెడు మార్గాల గుండా వెళుతున్నారని,వారిని చైతన్య పరచడానికి ప్రజానాట్యమండలి ఆట,పాటై ఐ ముందుకు సాగుతుందన్నారు.

కళ కల కోసం కాదు కళ ప్రజల కోసం అనే నినాదంతో నాటి స్వాతంత్ర ఉద్యమం నుండి వీర తెలంగాణ సాయుధ పోరాటం వరకు  పాటని తూటగా మలిచి ప్రజానాట్యమండలి ప్రజల చైతన్యానికి నడుం బిగించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద విష సంస్కృతిని పెంపొందించాలని వివిధ రూపాల్లో ప్రమాదకరంగా ముందుకు వస్తుందని దానికి ఎదురుకోవడానికి ప్రజా కళాకారులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమాజంలో జరుగుతున్న దాడులపై కళాకారులు ఆటపాటలతో ప్రజలను మేల్కొల్పాలని తెలిపారు. ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలు డిసెంబరు 6, 7తేదీలలో మాడుగులపల్లి మండల కేంద్రంలో జరుగుతాయని కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏర్పుల ఎల్లయ్య,ఏరుకొండ రాఘవేంద్ర, ఏర్పుల కవిత,వడ్డీ లోకేష్,వడ్డే హరికృష్ణ,నక్క ప్రమీల, బరిగెల కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -