నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ సృష్టికర్త అందె శ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని, యావత్ తెలంగాణ ప్రజానీకానికి తీవ్ర దిగ్భ్రాంతికి కి గురి చేసిందని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్య క్షులు కామిడి సతీష్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ ప్రేమ్ లాల్ లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ కవి డాక్టర్ అందె శ్రీ తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని జయ జయ హే తెలంగాణ గేయ రూపంలో రచించిన గీతం యావత్ తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా ఉంటుందని, నివాళులు అర్పిస్తూ అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ దుఃఖ సాగరంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వారు అన్నారు.
ప్రముఖ కవి అందెశ్రీ మరణం పట్ల తీవ్ర సంతాపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



