నవతెలంగాణ – తిప్పర్తి
తిప్పర్తి నుండి సర్వారం వెళ్లేటువంటి రహదారి గుంతలతో, కంకరతేలి అధ్వానంగా తయారయింది జన జీవనానికి చాలా ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు ప్రభుత్వం పైన ప్రజా పాలకుల పైన మండిపడుతున్నారు. అత్యవసర సమయంలో 108 సేవలు అందాలన్న, ఆస్పత్రికి వెళ్లాలన్న గుంతల వలన సరైన సమయానికి చేరుకోలేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతు పండించిన పంటను మార్కెట్ కు (లోడింగ్) తరలించాలంటే భయపడుతూ రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రహదారిని సుమారుగా 15-20 సంవత్సరాల క్రిందట ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద ఈ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది.
అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి.. కానీ ఈ రహదారిని మాత్రం కనీసం గుంతలు పూడ్చే ప్రయత్నం కూడా కొనసాగించలేదు. దీని వలన ఎన్నో ప్రమాదాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు, రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇంతకుముందు ఈ రూట్ లో బస్సు కూడా ప్రయాణించేది నల్గొండ నుంచి వయా తిప్పర్తి సర్వారం మీదుగా సూర్యాపేటకు తక్కువ దూరం వలన తక్కువ సమయంలో చేరుకునేది రోడ్లు ఇలా గుంతల కారణంగా బస్సు కూడా రావటం లేదు. అయినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. సంబంధిత శాఖ ప్రజా ప్రతినిధులకు విన్నపం రోడ్లను పునర్నిర్మించి బస్సు వచ్చే విధంగా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


