Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ కబ్జాలను తొలగించాలి: సీపీఐ(ఎం)

అక్రమ కబ్జాలను తొలగించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ- కంఠేశ్వర్ 
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ మండలం పెద్దవాలుగోటు గ్రామానికి చెందిన ప్రభుత్వ భూముల్లో ఉన్న కుంటలను చెరువులను అక్రమ కబ్జాదారుల నుండి కాపాడి ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలని జిల్లా అదనపు కలెక్టర్ కి సోమవారం వినతి పత్రం అందజేశారు. గ్రామానికి చెందిన సుమారు 25 నుండి 30 ఎకరాల ప్రభుత్వ భూములను కుంటలు, చెరువులను పూడ్చివేసి గ్రామ పెద్ద రైతులు రాజకీయ నాయకుల అండతో కబ్జాలు చేసి వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని వాటిని కాపాడటానికి ఇప్పటికే గ్రామస్తులు, సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రాలు ఇచ్చి విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడం జరిగిందని ఫలితంగా అక్రమ కబ్జాదారుల ఆటలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ప్రభుత్వ కుంటలను , చెరువులను కాపాడటానికి సర్వేలు నిర్వహించి సరిహద్దులను ఏర్పాటు చేయాలని అట్టి ప్రభుత్వ భూములను ప్రజల అవసరాల కొరకు, పేదల ఇండ్ల స్థలాల కొరకు ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు సీపీఐ(ఎం) కార్యకర్తలు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -