నవతెలంగాణ-హైదరాబాద్: గత 20ఏండ్లుగా బీహార్ లో అభివృద్ధి జరగలేదని, మహాగఠ్‌బంద్ కూటమి విజయం సాధిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామని ఆర్జేడీ అగ్రనేత మహాగఠ్‌బంద్ సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ అన్నారు. నితిష్ ఏండ్ల పాలనలో ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పాలేదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీహార్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో ఫార్మా,పుడ్, ఆగ్రో బేస్డ్ పరిశ్రమలు, నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలను పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. పాట్నాలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్‌లో ఐటీ హబ్స్, విద్యావ్యవస్థలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు. అదే విధంగా ఇకపై ఉపాధి కోసం బీహారీలు పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సిన అవసరంలేదని తేజస్వీయాదవ్ భరోసా ఇచ్చారు. రేపు బీహార్‌లో రెండో విడత పోలింగ్ జరగనుంది.బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈనెల 6న 121 స్థానాలకు మొదటి దఫా పోలింగ్ పూరైంది. 64శాతంగా పైగా పోలింగ్ నమోదైంది.
బీహార్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: తేజస్వీయాదవ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



