నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతుల భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వినతి పత్రాన్ని తాహసిల్దార్ చందా నరేష్ కు అందించినట్లు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు తెలిపారు. సాదా బాయి నామ భూభారతిలో దరఖాచేసుకున్న ఇతర సమస్యలు పరిష్కరించాలని తాసిల్దార్ను కోరే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో గతంలో భూభారతిలో రైతులు దరఖాస్తులు పెట్టుకున్న భూ సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు.
ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని మరియు వివిధ గ్రామాలలో ప్రభుత్వ భూములు అక్రమనకు గురవు తున్నాయని జిల్లా డివిజన్ మండల రెవెన్యూ అధికారుల కు గతంలో విన్నవించిన పట్టించుకోవడంలో జాప్యం జరిగిందని అన్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూములకు హద్దులు నిర్వహించి భూములు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ భూములలో బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించారు. ప్రజలను సమీకరించి ఆందోళన పోరాట నిర్వహిస్తామని డిమాండ్ చేశారు.



