Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని అమ్ముకోవాలి 

కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని అమ్ముకోవాలి 

- Advertisement -

చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి
నవతెలంగాణ మిడ్జిల్ 

రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే రైతులు అమ్ముకోవాలని  జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మల్లాపూర్, అయ్యవారిపల్లి, కంచనపల్లి గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో మహిళా సమైక జిల్లా అధ్యక్షురాలు స్వాతి తో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు వరి ధాన్యానికి మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మధ్యవర్తులకు అమ్ముకొని రైతులు మోసపోవద్దని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. వరితోపాటు అన్ని పంటలకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. సన్న రకాలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ క్వింటాలకు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం హైమావతి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సాయిలు, మిడ్జిల్ మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ గౌస్, నరసింహ,  మాజీ సర్పంచ్ కంచనపల్లి నరసింహ, డైరెక్టర్లు సత్యనారాయణ గౌడ్, బంగారు, ఐకెపి సిబ్బంది , రవీందర్, వెంకటయ్య, జంగయ్య, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్ రెడ్డి, అశోక్ ,శంకరయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -