11వ జోనల్ స్థాయి పోటీల్లో టోర్నమెంట్ ఛాంపియన్
నవతెలంగాణ – రామారెడ్డి
ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్లో జరిగిన 11వ జోనల్ స్థాయి పోటీల్లో ఉప్పల్ వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబరిచి ఛాంపియన్గా నిలిచారు. అండర్ 14 విభాగంలో అట్లాంటిక్స్ లో వ్యక్తిగత ఛాంపియన్గా జే శ్రీ సాయి, ఓరల్ ఛాంపియన్గా, ఖో ఖో విన్నర్ గా, కబడ్డీ విన్నర్ గా, అండర్ 17 విభాగంలో ఓవర్ గేమ్స్ ఛాంపియన్షిప్, ఫుట్బాల్ విన్నర్, బాల్ బ్యాడ్మింటన్ విన్నర్, ఖో ఖో రన్నర్స్ గా, అండర్ 19 విభాగంలో ఎల్ యోగి అట్లాంటిక్స్ వ్యక్తిగత విభాగంలో ఛాంపియన్షిప్, ఓరల్ అట్లాంటిక్ విభాగంలో ఛాంపియన్, ఓరల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో ఛాంపియన్, ఖో ఖో విన్నర్స్ , చెస్ విన్నర్, క్యారం విన్నర్స్, బాల్ బ్యాడ్మింటన్ రన్నర్స్ గా ప్రతిభ చూపారు.
ప్రిన్సిపాల్ శివరాం మాట్లాడుతూ .. పథకాలు సాధించడం సంతోషకరమని, క్రీడలో పిల్లల్లో శారీరక దారుడ్యాని పెంపొందిస్తాయని, మానసిక ఆరోగ్యాన్ని కలుగజేస్తాయని, క్రీడలను స్ఫూర్తిగా తీసుకొని చదువులో కూడా రాణించాలని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, సంతోష్ కుమార్, అభిలాష్, పిఈటి లింగం, కోచ్ సురేష్ తదితరులు ఉన్నారు.



