Monday, November 10, 2025
E-PAPER
Homeకరీంనగర్కవి అందెశ్రీ మృతికి ద్రోణ పబ్లిక్ స్కూల్ సంతాపం..

కవి అందెశ్రీ మృతికి ద్రోణ పబ్లిక్ స్కూల్ సంతాపం..

- Advertisement -

నవతెలంగాణ వేములవాడ 
ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ గీతం సృష్టికర్త అందెశ్రీ మృతికి సోమవారం వేములవాడ పట్టణంలోని ద్రోణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పీసర విజయలక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అందెశ్రీ పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన రచించిన “జయ జయహే తెలంగాణ” గీతం ప్రజలలో ఆత్మగౌరవాన్ని రేకెత్తించిందని, ఆయన సాహిత్యం ఎల్లప్పుడూ తెలంగాణ సంస్కృతికి ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.కవియైన అందెశ్రీ మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కౌడుక రమేష్, కోకిల నాగరాజు, బోనాల నాగరాజు, డాక్ నాగరాజు తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -