నవతెలంగాణ – కామారెడ్డి
ప్రజావాణిలో వస్తున్న అర్జీలకు అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలనీ జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్ ,డిప్యూటి కలెక్టర్ రవితేజ, ఆర్డీఓ లు కామారెడ్డి వీణ, ఎల్లారెడ్డి పార్థసారథి రెడ్డి లతో కలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు అధికారులకు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా వింటూ సంబంధిత ఆయా శాఖ జిల్లా ఆధికారులకు అర్జీలను ఇస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిధిలో పరిష్కరించగలిగిన వాటిని వెంటనే పరిష్కరించాలని, పరిధికి సంబంధించినవి కాని అంశాల పై దరఖాస్తుదారులకు సరైన సూచనలు అందించాలని తెలిపారు. ప్రజావాణి పెండింగ్ లో ఉన్న ఆయా జిల్లా అధికారులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి లో మొత్తం 80 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రజావాణిలో ఆయా జిల్లా అధికారులు, రెవెన్యు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



