నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని గ్రామాలైన దోచుపల్లి, వజ్రఖండి గ్రామాలలో ఇందిరమ్మ పథకంలో భాగంగా పలు గృహ నిర్మాణాలకు ఎంపీడీవో శ్రీనివాస్ సోమవారం నాడు మార్కౌట్ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాలలో దోచుపల్లిలో 8 కొత్త గృహాలకు మార్కెట్ చేయడం జరిగిందని , అదేవిధంగా వజ్రఖండి గ్రామంలో ఎనిమిది గృహ నిర్మాణాలను మార్కెట్ చేసి ఎంపీడీవో స్థానిక అధికారులతో కలిసి పనులను ప్రారంభించడం జరిగింది. ఇందిరమ్మ పథకంలో మంజూరైన గృహ నిర్మాణాల లబ్ధిదారులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో లబ్ధిదారులకు సూచించారు.
డబ్బుల విషయంలో ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మూడు విడుదలుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే తమకు నేరుగా వచ్చి తెలియజేయాలని వాటి పరిష్కారం కొరకు మండల స్థాయి అధికారులు కలిసి సమస్యలు పరిష్కరించి గృహ నిర్మాణాలు జరిగే విధంగా తమవంతుగా సహాయ సహకారాలు గృహ నిర్మాణాల లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు దోస్పల్లి , వజ్రఖండి గ్రామాలకు సంబంధించిన గ్రామపంచాయతీ కార్యదర్శులు , గృహ నిర్మాణాల లబ్ధిదారులు, గ్రామ పెద్దలు , ఇందిరమ్మ గృహ పథకం గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



