Monday, November 10, 2025
E-PAPER
Homeజాతీయంరాజస్థాన్‌, తెలంగాణ రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటో

రాజస్థాన్‌, తెలంగాణ రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇటీవల రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను సుప్రీంకోర్టు సోమవారం సుమోటోగా స్వీకరించింది. ఈ రెండు ప్రమాదాల్లో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది చిన్నారులే చనిపోవడం భయాందోళనలకు గురిచేస్తోందని సుప్రీంకోర్టు తెలిపింది. భారతీయ రోడ్లు అమాయకులని చంపేస్తున్నాయి. ఎందుకిలా జరిగిందో వివరణ ఇవ్వాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌ఎస్‌ఎఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు రోజుల్లో భయంకరమైన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 40 మంది చనిపోయారు. ఈ సంఖ్య చాలా ఎక్కువ అని జస్టిస్‌ జె.కె మహేశ్వరి, జస్టిస్‌ విజరు బిష్ణోరులతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -