- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
మండల కేంద్రంలోని సెయింట్ మేరీ హైస్కూల్లో చదువుకుంటున్న బరిగల సోనాక్షి ఖోఖో పోటీలలో మండల స్థాయిలో ఎంపిక కాగా ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన ఖోఖో పోటీలలో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ జోసెఫ్ సోమవారం ఒక ప్రకటనల తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన సోనాక్షికి జడ్చర్ల మార్కెట్ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, బరిగెల వెంకటయ్య, సాయిలు, సంపత్ కుమార్, నరేందర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి ,శంకర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి, మండలానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
- Advertisement -



