నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని రహదారులు మరియు రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యాలను రైతులకు జుక్కల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నోటీసులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ.. మండల పరిధిలోని ముఖ్యమైన రహదారులు ,రోడ్లపైన కొంతమంది రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టడం జరిగింది. ఇది రహదారి సదుపాయాల దుర్వినియోగం కింద పరిగణించబడుతుంది. ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా పరిగణించబడడం జరుగుతుంది. ఈ మేరకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు పలు సూచనలు చేశారు. వెంటనే రహదారుల మీద వరి ఆరబెట్టడం నిలిపివేయాలి. ఇప్పటికే రహదారి మీద ఆరబెట్టిన వరి ధాన్యాన్ని తొలగించాలి. నోటీసులు స్వీకరించిన తర్వాత 24 గంటల్లోపు చర్యలు చేపట్టాలి. ఆదేశాలు పాటించకపోతే మోటర్ వాహనాలు చట్టాల ప్రకారం సెక్షన్ 201 మరియు 283 ఐపిసి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక హెచ్చరిక మాత్రమే అని అన్నారు. మరల ఉల్లంఘన జరిగినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది ప్రజా భద్రత మరియు ట్రాఫిక్ సౌకర్యం కోసం జారీ చేయబడినది. సమస్యను అర్థం చేసుకొని రైతులు సహకరిస్తారని కోరనైనది.
రహదారులపై పంటలను ఆరబెట్టిన రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



