ఆర్టీఐ కాటారం డివిజన్ కన్వీనర్ కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రముఖ రచయిత, ప్రజాకవి అందెశ్రీ అకాల మరణం చాలా బాధాకరమని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అక్షర నివాళులర్పిస్తున్నట్టుగా తెలిపారు. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన ఆయన జయ జయహే తెలంగాణ గీతం రచించి, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఇటీవల రూ.కోటి పురస్కారం ప్రభుత్వం ద్వారా అందుకున్నట్లుగా తెలిపారు. 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం, 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్ నాయక్ పురస్కారాలు అందుకున్నారన్నారు.
ప్రజాకవి అందెశ్రీ అకాల మరణం బాధాకరం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


