Tuesday, November 11, 2025
E-PAPER
Homeమానవిఫ్రెష్‌గా ఉండాలంటే…

ఫ్రెష్‌గా ఉండాలంటే…

- Advertisement -

టమాటాలేని వంటలు ఊహించలేం. అందుకే ప్రతి వంటలోనూ వీటిని వాడేస్తుంటాం. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికీ మంచిది. అయితే ఇవి కొన్న కొద్ది రోజులకే పాడైపోతుంటాయి. అలాకాకుండా టమాట ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.. టమాటాలను మార్కెట్‌ నుంచి తీసుకువచ్చిన తర్వాత వాటిని కడిగి.. వెంటనే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. తడిగా ఉంటే, బాగా ఆరబెట్టి, ఆపై ఫ్రిజ్లో ఉంచడం మంచిది. టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు వాటిని పేపర్‌లో చుట్టి పెట్టాలి.

ఇలా ఉంచితే పొడిగా ఉండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. వంటకు ముందు పసుపు నీటిలో టమోటాలు కడగడం అలవాటు చేసుకోవాలి. మార్కెట్‌ నుంచి తెచ్చిన టమాటాను పసుపు నీళ్లలో కడిగి ఆరబెట్టాలి. ఇలా చేస్తే టమాటాలు తాజాగా ఉంటాయి. వీటిని వంట కోసం ఉపయోగించినప్పుడు, ముందుగా పండిన టమోటాలను ఉపయోగించండి. మిగిలిన టమోటాలు ఉంటే, వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. టమాటాలను కొనుగోలు చేసేటప్పుడు, పచ్చి, పండని టమాటాలను కొనాలి. ఇవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -