- Advertisement -
‘మాయమై పోతున్నడమ్మా
మనిషన్నవాడ’ని
నీ గురించే పాడుకున్నవా?
సాహిత్య విరించీ అందెశ్రీ!
ప్రేమానురాగాల సుగంధశ్రీ!!
సృష్టిదీపాలన్నీ వెలిగే నీ అక్షరాలై
తుఫానులన్నీ వీచే నీభావాలై
కలలన్నీ సాకారం కావాలని
అడుగులన్నీ శిఖరం చేరాలని
బాటలు పరిచిన పాటగాడా!
చింతలు చీకట్ల మీద
కాగడాలు దూసిన వేటగాడా!
ఎవరికోసం కలమెక్కుపెట్టినవొ
ఆ ప్రజలను విడనాడిపోతవా?
జనంమెచ్చిన జాతికి నీవిచ్చిన పాటను
‘జయ జయహే అందెశ్రీ చాచా’ అని
కొట్లాది మంది పిల్లలు మనసావాచా
పాడుకుంటున్నారు గుండెలవిసేలా
నీవులేకున్నా నీ పాటలుంటాయి
ఆత్మలో నీవు పరిచిన బాటలుంటాయి
-అమ్మంగి వేణుగోపాల్, 9441054637
- Advertisement -



