Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజావాగ్గేయకారుడు అందెశ్రీకి నివాళి

ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీకి నివాళి

- Advertisement -

నవతెలంగాణ -ప్రత్యేక ప్రతినిధి
ప్రజాకవి, వాగ్గేయకారుడు డాక్టర్‌ అందెశ్రీ గుండెపోటుతో మరణించడం బాధాకరం. సాటి ప్రజలు, చుట్టూ ఉన్న ప్రకృతిని పాఠశాలగా భావించి ఆయన నేర్చుకున్నపాటల విద్య తెలంగాణ గీతమై మన హృదయాల్లో మాయం కాలేని గుర్తుగా మిగిలిపోయింది. ఎన్నో డాక్టరేట్లకు సమానమైన సాహిత్యాన్ని సృష్టించింది. తెలంగాణ ఉన్నంతవరకు అందెశ్రీ గీతం ఉంటుంది. ఆయన ప్రజల కవి. ప్రకృతి కవి. తెలుగునేల గుర్తించే విశ్వకవి కూడా. –అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, మల్సూర్‌, పోతుల రమేష్‌

చైతన్య వాగ్దార అందెశ్రీ
జయ జయహే తెలంగాణ అని జన హృదయపుటల్లో నినాదమై మోగిన జాతిగీత సృష్టికర్త అందెశ్రీ. అవిశ్రాంత వాగ్ధార ప్రవాహామైన ప్రజలను మేల్కొల్పిన వైతాళికుడు. గాన చైతన్యమై అలుపెరుగక దూకిన నిప్పులవాగు. అట్టడుగువర్గాల ప్రతిభా కేతనం అందెశ్రీ మృతి తెలంగాణ సమాజానికి తీరనిలోటు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాం.
-కొండ మల్లారెడ్డి, అధ్యక్షులు బూర్ల వెంకటేశ్వర్లు ప్రధానకార్యదర్శి తెలంగాణ రచయితల వేదిక(తెరవే)

అకాలమరణం పట్ల బాధాకరం
తెలంగాణ ముద్దుబిడ్డ గొప్ప కవి, రచయిత అందెశ్రీ మరణం బాధాకరం. సాహితిలోకానికి, తెలంగాణ సమాజానికి తీరనిలోటు. ప్రజల గుండెచప్పుళ్లను తన పాటల ద్వారా వినిపించి మేల్కొలిపిన మహాకవి అందెశ్రీ. మలిదశ ఉద్యమంలో ప్రజల గుండెల్లో రాష్ట్ర సాధన ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన చారిత్రక గీతం జయ జయహే తెలంగాణ జననవి జయకేతనం అందించిన ప్రజాకవి.
ఎస్‌.బాబు అధ్యక్షులు,ఈదురు వెంకన్న ప్రధానకార్యదర్శి టీజీఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌

అందెశ్రీ మరణం తీరనిలోటు
తెలంగాణ గుండె చప్పుడును తన పాటల్లో సమాజానికి వినిపించిన అందెశ్రీ ఇకలేకపోవడం బాధాకరం. తెలంగాణ గీతాన్ని ప్రజలకు అందించడం గొప్ప విషయం. ఆయన రాసిన ఎన్నో పాటలు పాపులర్‌ అయ్యాయి. వీపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన మృతికి నివాళులు. కుటుంబానికి సానుభూతి. బి.బసవపున్నయ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి టీడబ్ల్యూజేఎఫ్‌

కవి అందెశ్రీకి డీజీపీ నివాళులు
కన్నుమూసిన ప్రముఖ తెలంగాణ కవి, రచయిత అందెశ్రీకి రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి సోమవారం రాత్రి నివాళులర్పించారు. లాలాగూడలోని జీహెచ్‌ఎంసీ మైదానంలో ఉంచిన అందెశ్రీ భౌతిక కాయంపై ఆయన పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.తెలంగాణ రాష్ట్ర అధికార గేయం ‘జయ జయహే తెలంగాణ..’ ను రాసిన అందెశ్రీ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని ఆయన శ్లాఘించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -