ఎస్టీయూటీయస్
నూతన కార్యవర్గం ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలనీ ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రవి, జి. సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ కాచిగూడలోని ఎస్టీయూటీఎస్ భవన్‌లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీని 50 శాతం ఫిట్మెంట్‌తో అమలు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. టెట్ నుంచి మినహాయింపు విద్యా హక్కు చట్టం సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించి, ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులివ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ముఖ్యంగా హెల్త్ కార్డులు, గురుకుల , కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అదనపు కలెక్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారులుగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉపాద్యాయ సంఘాలతో విద్యా శాఖ కార్యదర్శి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
2026-2027 సంవత్సరాలకుగానూ నూతన కార్య వర్గాన్ని సమావేశంలో ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర పూర్వ ఆర్థిక కార్యదర్శి జగన్మోహన్ రావు, సీనియర్ నాయకులు పున్న గణేష్, మోదిని శ్రీశైలం, వహిదుల్లా ఉస్సేని వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షులుగా జి.సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జట్టు గజేందర్ (నిర్మల్), ఆర్థిక కార్యదర్శిగా సయ్యద్ సాబేర్ అలీ (సంగారెడ్డి), వివిధ జిల్లాల నుంచి 8 మంది రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, 16 మంది ఉపాధ్యక్షులు, 8 మంది అదనపు ప్రధాన కార్యదర్శులు,16 మంది కార్యదర్శులు, 8 మంది ఆర్థిక కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర నాయకులు అట సదయ్య, జుట్టు గజేందర్, ఎ.వి.సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, హన్మంత్ రెడ్డి, రాధ జయ లక్ష్మి, శీతల్ చౌహాన్, రంగా రావు, అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



