లేబర్ కోడ్స్ చట్టాలుగా మారకముందే యాజమాన్యాల బరితెగింపు
బిస్లరీలో యూనియన్ పెట్టకున్నారని ఉద్యోగం తీసేశారు
మైక్రోబాక్స్ కంపెనీలో 13 మంది తొలగింపు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
యూనియన్ పెట్టుకున్నారనే కక్షతో బిస్లరీ కంపెనీ యాజమాన్యం కార్మికులను విధుల నుంచి తొలగించిందని, తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్ చేశారు. బిస్లరీ, మైక్రో బాక్స్ కంపెనీ ల్లో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ.. సోమవారం సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా చుక్క రాములు మాట్లాడుతూ.. పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలో యూనియన్ పెట్టుకున్నారనే సాకుతో ఐదుగురు యూని యన్ నాయకులను ఉద్యోగం నుంచి తొలగిం చారన్నారు. అదే విధంగా కొండాపూర్ మండలంలో మైక్రోబాక్స్ అనే కంపెనీలో సీఐటీయూ యూనియన్ పెట్టకున్నారని 13 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిం చారని తెలిపారు. దీనిపై లేబర్ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
చట్టాలు అమలు చేయకపోతే చట్టాన్ని రక్షించాల్సిన యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉంటుందో సమాధానం చెప్పాల న్నారు. అనేక కంపెనీల్లో వేతనాలు ఇవ్వడం లేదన్నా రు. యూబీ నైజాం బీరు కంపెనీ ఉత్పత్తి ఆపేశారని, దీనివల్ల 200 మంది కాంట్రాక్టు కార్మికులు ఉపాధి కోల్పోయా రని తెలిపారు. ఎలాంటి ముందస్తు నోటీసు లు లేకుండా ఉత్పత్తి ఎలా ఆపేస్తారని, మీకు కార్మిక చట్టాలు వర్తించవా అని యాజ మాన్యాన్ని ప్రశ్నించారు. ఆర్చ్ ఫార్మా కంపెనీలో దాదాపు 11 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఇలా సంగారెడ్డి జిల్లాలోని అనేక కంపెనీల్లో ఇంత దారుణంగా కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగు తుంటే కార్మికశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిం చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చిం దన్నారు. ఇంకా అది పూర్తిగా అమలులోకి రాలేదని, ఈ చట్టాలు ఉండగానే ఇంత ఘోర పరిస్థితి ఉంటే రేపు ఈ చట్టాలు రద్దయితే కార్మికులు బానిసలుగా మారా ల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా యూనియన్ పెట్టుకునే హక్కును కూడా యాజమాన్యాలు సహించే పరిస్ధితి లేదన్నారు.
ఈ అప్రజాస్వామిక వైఖరి వీడాలని, తొలగించిన కార్మికులను బిస్లరీ యాజమాన్యం, మైక్రోబాక్స్ యాజమాన్యం వెంటనే విధుల్లోకి తీసుకోవా లని, ఆర్చ్ ఫార్మా కంపెనీ వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగు తున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సిగాచి పరిశ్రమలో 54 మంది చనిపోయారని, రూ.కోటి నష్టపరిహారం ఇస్తామని సీఎం స్వయంగా ప్రకటించినా నేటికీ అరకోటి ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకో వాలని, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న యాజమాన్యాల్ని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు, అధికార యంత్రం ముందుకు రాకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ధర్నా లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లిఖా ర్జున్, జిల్లా అధ్యక్షకార్యదర్శులు బీరం మల్లేశం, జి.సాయిలు, కోశాధికారి కె.రాజయ్య, ఉపాధ్య క్షులు అతిమేల మాణిక్, నాయకులు ప్రవీణ్, పాండు రంగారెడ్డి, బాగారెడ్డి, నాగేశ్వర్ రావు, మైపాల్, యాదగిరి, కే.సురేష్, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి ఎ.నాగభూషణం పాల్గొన్నారు.
కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



