Tuesday, November 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు.. పాడె మోసిన సీఎం రేవంత్‌రెడ్డి

ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు.. పాడె మోసిన సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లోని ఎన్ఎఫ్‌సీ నగర్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అంతియ యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్, అందెశ్రీ అభిమానులు, సాహితీ ప్రియులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకు ముందు అందెశ్రీ భౌతికకాయనికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించి ఆయన పాడెను మోశారు. ఈ సందర్భంగా రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఆయన ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు. రెండు నిమిషాలు పాటు అందరూ మౌనం పాటించగా.. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల పాటు గౌరవ సూచికంగా కాల్పులు జరిపారు. అనంతరం అందెశ్రీ కుమారుడు ఆయన చితికి నిప్పు పెట్టడం అంత్యక్రియలు ముగిశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -