– సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త శివ సాయి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రైతులు వరి పంటను కోసినా అనంతరం వరి కోయ్యల అవశేషాలు కాల్చడం ద్వారా అపారమైన నష్టాలు ఉంటాయని సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త శివ సాయి అన్నారు. మంగళవారం వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో రైతులకు వరి కొయ్యలను కాల్చడం వల్ల జరిగే నష్టాలపై సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త శివ సాయి మాట్లాడుతూ రైతులు వరి పంటను కోసినా అనంతరం వరి కోయ్యల అవశేషాలు కాల్చడం ద్వారా అపారమైన నష్టాలు ఉంటాయన్నారు.వరి కొయ్యలను కాల్చడం వల్ల నైట్రోజన్, పాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఆవిరైపోతాయని తద్వారా భవిష్యత్తులో పంటల కోసం భూమిలో ఉండకుండా పోతుందన్నారు.
వాయు మాలిన్యం ఏర్పడి ఊపిరితిత్తుల సమస్యకు దారితీస్తుందనీ, వరి కొయ్యలు కాల్చేటప్పుడు కాలిపోని కొయ్యలు అవశేషాలు, కీటకాలు, వ్యాధుల నివాసాలుగా మారుతాయని తెలిపారు. మట్టిలోని సూక్ష్మజీవాలు దెబ్బతిని భూమి సంతులనం కోల్పోతుందన్నారు. వరి కొయ్యలు కాల్చడం వల్ల మట్టిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, భవిష్యత్తు పంటలకు ఎక్కువగా నీరు అందించే అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రతి రైతు వరి కొయ్యలను కాల్చకుండా దమ్ము చక్రాలు చేసేటప్పుడు సరైన మార్గంలో భూమిని దమ్ము చేసినట్టయితే భూమిలో కలిసిపోతాయన్నారు. భూమికి పోషక పదార్థాలు అంది తద్వారా పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. త్వరగా కుళ్ళిపోవడానికి బయో డీకంపోజర్ వంటి సిలింద్రియాలు వాడడం వల్ల వరి కొయ్యలు 25 రోజుల్లో కుళ్ళిపోతాయన్నారు. కుల్ల పెట్టడం వల్ల ఎరువుగా మారి భూసారని పెంచుతుందనీ రైతులకు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, సిఆర్ పి చింత శ్రీనివాస్, హార్టికల్చర్ ఆఫీసర్ రాజు, వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయిరాజ్, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.



