నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. రాబోయే మూడు రోజుల పాటు విజిటర్స్‌కు ఎర్రకోట బంద్ ఉంటుందని అధికారులు చెప్పారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దీనిపై ప్రకటన చేసింది. కారు బాంబు పేలుడు జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అయితే ప్రజలు భారీ స్థాయిలో గుమ్మికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎర్రకోటను బంద్ చేస్తున్నట్లు ఏఎస్ఐ ప్రకటించింది.దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోట(Red Fort) సమీపంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు కారు పేలుడు ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ పేలుడు ధాటికి 13 మంది మృతిచెందగా, 20 మంది వరకు గాయపడ్డారు.
ఎర్రకోట సందర్శన నిలిపివేత