– నిందితుడు అరెస్టు, రూ.2,33,500 నగదు, స్కూటి, మొబైల్ స్వాధీనం: జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల : ఆన్లైన్ బెట్టింగులకు, గేమ్స్ లకు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్యేశం తో మహిళ మేడలోని బంగారు గొలుసు దొంగలించాలని నిర్ణించుకొని మహిళను హత్య చేసి బంగారు పుస్తెలా తాడు దొంగలిండం తో జిల్లా కేంద్రంలో సంచలనంగా మారిన కేసును గద్వాల పోలీసులు చేదించి నిందితుడిని అరెస్ట్ చేసి, రూ.2,33,500 నగదు, ఒక స్కూటీ, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి భర్త మల్లికార్జున్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో మృతురాలి మెడ నుండి పూస్తేలతాడు మాయం చేయబడి వున్నందున ఈ హత్య ఆస్తి కోసం జరిగి వుండవచ్చును అని ప్రాథమిక నిర్ధారణ వచ్చి ఉన్నతదికారుల ఆదేశం మేరకు విచారణ ప్రారంబించారు. ధరూర్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి కుమారుడుకాళ్ళ రామిరెడ్డి పై కేసు నమోదు చేశారు.
నేరస్తుడు గద్వాల మార్కెట్ యార్డ్ లోని కమిషన్ మర్చంట్ లో తన తండ్రి తో పాటు ఉంటూ వ్యాపార కార్యక్రమాలు చూసుకునేవాడు, తన కుటుంబ సభ్యులతో కలిసి షెర్రెల్లి వీధి లోని తన పెద్దన్నాన్న ఇంట్లో ఫై ఫోర్షన్ లో నివాసం ఉండేవాడు. ఇంటి కింది భాగంలో ఫిర్యాదు దారుడు తన కుటుంబం తో కలిసి ఉంటున్నాడు. తర్వాత నేరస్తుడు కొన్ని రోజుల క్రితం మరో ఇంటికి మారి పాత ఇంటి కిరాయి వసూలు చేసి డబ్బును తన పెద్ద నాన్నకి ఇచ్చేవాడు, అలా అక్కడికి వెళ్ళే క్రమంలో మృతురాలితో పరిచయం ఏర్పడింది.
నేరస్తుడు తన భార్య దగ్గర కొంత డబ్బును, బంగారం తీసుకొని ఆన్లైన్లో గేమ్స్ ఆడి పోగొట్టుకున్నాడు. అప్పులు చేసుకున్నా నిందితుడు మృతురాలు అయిన లక్ష్మి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంది ఆమె దగ్గర వడ్డీకి తీసుకొని అప్పులను కట్టుకోవాలని నిర్ణయించుకొని ఈనెల 2న నేరస్తుడు ఉదయం 11 గంటలకు తన స్కూటీపై మృతరాలు లక్ష్మి ఇంటికి వెళ్లి డబ్బులు అడగగా ఆమె ఇప్పుడు డబ్బులు లేవు కొంచెం టైం పడుతుంది నీకు డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానని చెప్పింది. అప్పుడు డబ్బులు చాలా అవసరం ఉందని ఆమెను బలవంతం పెట్టి డబ్బులు ఇవ్వండి అని అడగగా ఆమె ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది అప్పుడు నిందితుడు మృతురాలి మెడలో ఉన్న బంగారు పూస్తేలతాడును చూసి ఎలాగైనా ఆమెను చంపి ఆ గొలుసును దొంగలించి అమ్మి వాటితోనే అప్పులు తీర్చుకోవాలని అనుకొని బలంగా చేతులతో మృతురాలిని వెనుకకునేట్టగా ఆమె వెల్లకిలా పడిపోగా గొంతు నులిమి హత్య చేసి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు.
మెడలో నుంచి తీసి తన దగ్గర పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మరసటి రోజు ఉదయం తనకు చిన్ననాటి స్నేహితుడైన ఉమేష్ కు శంషాబాద్ లో గోల్డ్ షాప్ ఉన్నందున అతన్ని కలిసి అట్టి బంగారు పూస్తేల తాడు ను తన భార్య నాన్నమ్మది అని చెప్పి వీటిని కరిగించి ఇవ్వు వీటితో భార్యకు, కొడుకు చైన్ చేపించాలని అడిగాడు అందుకు అట్టి వ్యక్తి బంగారాన్ని కలిగించి ముద్దగా ఇవ్వగా దాన్ని మరలా బిస్కెట్ రూపంలోకి మార్చుకొని హైదరాబాద్ నందు ఉప్పరగూడలో అమ్మగా రూ.4.60 లక్షల నగదు తీసుకున్నాడు. అట్టి డబ్బులు తన ఖర్చులకు కొంతవరకు వాడుకొని భార్యకు ఇయర్ రింగ్స్ చేయించి, బట్టలను కొనిపెట్టి మిగిలిన రూ.1,33,500 తన స్కూటీ నందు ఉంచుకొని మిగిలిన రూ.1.20 లక్షలు తనకు పరిచయం ఉన్న ఫ్రెండ్స్కు అప్పులు కట్టుకొని తన ఇంకా గద్వాల్ లో కుదువ పెట్టిన తన భార్య బంగారాన్ని రూ.1,65, 000 కట్టి విడిపించికున్నాడు.
జోగుళాంబ గద్వాల ఎస్పి టి.శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ కె.శంకర్ పర్యవేక్షణలో గద్వాల డి.ఎస్.పి వై.మొగిలయ్య, గద్వాల సీఐ శ్రీను ఆద్వర్యం లో పోలీస్ ప్రతేకా బృందాలను ఏర్పాటు చేసి, మృతురాలు ఇంటికి ఎవరెవ్వరు వచ్చినారు, మృతురాలు ఎవరెవ్వరికీ డబ్బులు వడ్డీలకు ఇచ్చినది, అమేతో డబ్బుల గురించి ఎవ్వరూ మాట్లాడినారు అని ముమ్మరంగా దర్యాప్తు చేయగా నేరస్తుడు మృతురాలిని డబ్బులు అడిగినట్టు, అతడే మృతురాలు ఇంటికి, మృతురాలి భర్త షాప్ దగ్గరకు వెళ్ళి నట్లు CCTV ఫూటేజ్ ఆదారంగా నిర్ధారణ కాగా, నేరస్తుడే నేరం చేసి ఉంటాడని అతడిని మంగళవారం ఉదయం 07:00 ఇంటి దగ్గర పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించగా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. నగదును, ఇతర వస్తువులు స్వాదినం చేసుకోవడం జరిగింది. అనంతరం నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది. ఈ కేసును ఛేదించడం లో ప్రతిభ చూపిన కల్యాణ్ కుమార్, ఎస్సై- గద్వాల్ టౌన్, సతీష్ రెడ్డి ఎస్సై-2, గద్వాల్ టౌన్, శ్రీకాంత్ ఎస్సై- గద్వాల్ రూరల్, నంధికర్ ఎస్సై-మల్దకల్, శ్రీహరి ఎస్సై-దరూర్, చంద్రయ్య, PC-3221, కిరణ్ PC-383, రామకృష్ణ PC-2204, వీరేశ్ PC-2553 లను జిల్లా SP క్యాష్ రివార్డ్ తో అబినధించారు.


