Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్డిఓ కార్యాలయాన్ని కార్యాలయాన్ని మొరాయించిన పోలీసులు

ఆర్డిఓ కార్యాలయాన్ని కార్యాలయాన్ని మొరాయించిన పోలీసులు

- Advertisement -

– గ్రామాలలో గ్రామసభలు నిర్వహించిన తర్వాతనే భూములు తీసుకోవాలని త్రిబుల్ ఆర్ బాధితులు డిమాండ్
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండల త్రిబుల్ ఆర్  బాధితులు మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మంగళవారం ఉదయమే పోలీసులకు సమాచారం అందడంతో చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం దగ్గర పోలీసులు ఎక్కడ అవాంచన ఘటనలు జరగకుండా భారీగా వచ్చారు. త్రిబుల్ ఆర్ బాధితుల సంఘ నాయకులు బూరుగు కృష్ణారెడ్డి చింతల దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు కార్యాలయం ఎదుట  కూర్చున్నారు. ఆర్డీవో బయటికి వచ్చి రైతులకు సమాధానం చెప్పాలని బాధితులు నినాదాలు చేశారు.

అనంతరం ఆర్డిఓ బయటికి వచ్చి రైతులతో మాట్లాడారు.గ్రామాలలో గ్రామసభలు నిర్వహించకుండా రైతుల భూములు గుంజుకోవద్దని రైతులు తెలిపారు. మమ్మల్ని సంప్రదించకుండా అధికారులు కానీ పోలీసులు గాని భూముల పైకి వస్తే ఎంతటికైనా తెగిస్తామని ఆర్డీవోకు పోలీసులకు హెచ్చరించారు.తక్షణమే చౌటుప్పల్ మండలంలోని భూములు కోల్పోతున్న రైతులతో కలెక్టర్ తో సమావేశం పరచాలని రైతులు ఆర్డీవోకు తెలిపారు. ఆర్డిఓ వెల్మ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలల కాలంలో మండలంలో భూములు కోల్పోతున్న రైతులతో గ్రామ సభలు నిర్వహించిన తర్వాతనే భూముల వద్దకు వస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఆర్ బాధితులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -