నవతెలంగాణ – మద్నూర్
హిందూవులకు పవిత్ర మాసమైన, భోళా శంకరుడికి ఇష్టమైన కార్తీకమాసంలో నవంబర్ 13 నుంచి 15 వరకు భక్తి శ్రద్దలతో, పూజలతో, ఉత్సవాలు మద్నూర్ లో మరోసారి మారుమోగనున్నాయి. వంశపారంపర్యంగా కొనసాగుతున్న శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలు ఈసారి మరింత వైభవంగా, విశేషంగా నిర్వహించబడుతున్నాయి.
ఉత్సవాల షెడ్యూల్:
నవంబర్ 13న పసుపు పూసుడు
నవంబర్ 14న సాయంత్రం కల్యాణోత్సవం, అన్నప్రసాదం
నవంబర్ 15న ఉదయం 7 గంటలకు అగ్నిగుండం కార్యక్రమం
భక్తి – సాంప్రదాయం – ఐకమత్యం : మద్నూర్ గర్వకారణం!
గ్రామస్థులు సహకారం, చేయూత అందించి ఈ మహోత్సవాలను విజయవంతం చేయాలని వీరభద్ర స్వామి పూజారి సంగయ్యప్ప ఒక ప్రకటన ద్వారా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొని వీరభద్ర స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు.



