నవతెలంగాణ – మిరుదొడ్డి
అక్బర్ పేట్ -భూంపల్లి మండలం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పుట్టినరోజు నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్ధం ఆయన పుట్టినరోజు( 11 నవంబర్ 1888) ను జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008, సెప్టెంబరు 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిందన్నారు . భారత ప్రభుత్వం మరణానంతరం 1992లో అతనికి భారతరత్న ఇచ్చి గౌరవించింది. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు విద్యా -దాని ప్రాముఖ్యత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించరు. వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిషన్, ఉపాధ్యాయులు పెరుమాండ్ల శ్రీనివాస్, బాలకృష్ణ, రాజేశ్వరి, సరిత, నవిత, నవనీత విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రాథమిక పాఠశాల భూంపల్లిలో జాతీయ విద్యా దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



